వాతావరణంలో మార్పులు, ఎండల తీవ్రత వల్ల శరీరంలో వేడి పెరిగి నీరసం, జీర్ణక్రియ సమస్యలు వస్తాయి. వీటిని తగ్గించుకోవడానికి మందుల కంటే ఆహారంలో మార్పులు చేసుకోవడం ముఖ్యం. దోసకాయ, పుచ్చకాయలు శరీరానికి నీటిశాతం అందించి హైడ్రేట్‌గా ఉంచుతాయి. మజ్జిగ, పెరుగు కడుపులో మంట, వేడిని తగ్గించి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. కొబ్బరి నీళ్లు శరీర ఉష్ణోగ్రతను తగ్గించి, తక్షణ శక్తిని అందిస్తాయి. పుదీనా శరీరాన్ని చల్లబరచి, ఆహారం త్వరగా అరిగేలా చేస్తుంది. సహజసిద్ధమైన ఈ ఆహారాలతో ఒంటి వేడిని తగ్గించుకోవచ్చు.