Coconut Milk : కొబ్బరి పాలతో కలిగే లాభాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు…!


Coconut Milk : సాధారణంగా పిల్లలు ఆరోగ్యంగా ఉండటం కోసం పాలను ప్రతిరోజు క్రమం తప్పకుండా ఇస్తూ ఉంటాం. కేవలం పాలు మాత్రమే కాకుండా కొబ్బరిపాలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి ఆరోగ్యపరంగా కాకుండా అందం పరంగా కూడా ఎంతో మేలు చేస్తాయి. ప్రస్తుతం వాతావరణం లో పెరుగుతున్న కాలుష్యం వల్ల ముఖంపై మచ్చలు మొటిమలు బాధిస్తూ ఉంటాయి. వీటిని తొలగించడానికి కొబ్బరి పాలు ఎంతో చక్కగా పనిచేస్తాయి. నీటిలో కొద్దిగా రోజు వాటర్ కొబ్బరి పాలు కలిపి మిశ్రమాన్ని స్నానానికి ఉపయోగించాలి. ఈ విధంగా చేయడం వల్ల బాగా పాడైన చర్మం కూడా తిరిగి తాజాదనాన్ని సంతరించుకుంటుంది. కావాలనుకుంటే కొబ్బరిపాలను నేరుగా చర్మానికి అప్లై చేసుకొని నెమ్మదిగా మర్దన చేసుకోవాలి.

చర్మానికి తేమా అందడంతో పాటు చాలా సాఫ్ట్ గా మారుతుంది. అంటే చర్మానికి కొబ్బరి పాలు సాహసిద్ధంగా మాయిశ్చరైసర్ గా క్లీనర్ గా కూడా పనిచేస్తుంది. దుమ్ము దులితో పాటు కాలుష్యం ప్రభావంతో చర్మం కల కోల్పోతుంది. కొన్ని గులాబీ రేకులు పాలను బకెట్ గోరువెచ్చని నీటిలో వేసుకొని స్నానం చేయాలి. దాని వల్ల శరీరానికి తగిన తేమా అంది కాంతివంతంగా తయారవుతుంది.. కొబ్బరిపాలతో మనకు అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటంటే ఇప్పుడు చూద్దాం..పాలను తరచూ తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలను పొందొచ్చు. దీనిలో ఫాస్ఫరస్, కాల్షియం పోషకాలు ఎక్కువగా ఉండడంతో ఎముకలకు సంబంధించిన మేలు చేస్తుంది మధుమేహ వ్యాధిగ్రస్తులకు దోహదపడుతుంది.ఇది రక్తంలో చక్కెర నిల్వలు తక్కువగా ఉన్న వారికి ఎంతగానో ఉపయోగపడతాయి

ఆర్థరైటిస్ కు చక్కని మందుగా పని చేస్తాయి. రోజుకొక కప్పు కొబ్బరి పాలను తీసుకుంటే రక్తహీనత తొలగిపోతుంది. అలాగే ఇది వెంట్రుకలు రాలకుండా సహాయపడుతుంది. కొబ్బరి పాలలో నిమ్మరసం కలిపి ఫ్రిజ్లో రెండు నుంచి మూడు గంటల పాటు ఉంచాలి. అనంతరం బయటకు తీసి దాని పైన ఏర్పడిన పొరను తొలగించాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి మాడుకు పట్టించి వేడి నీటిలో ముంచిన టవల్ను తలకు చుట్టాలి.గంట సేపు అలాగే ఉంచి షాంపుతో తలస్నానం చేయాలి. వారానికి రెండు సార్లు ఇలా చేస్తూ ఉంటే వెంట్రుకలు రాలడం తగ్గుతుంది. అలాగే కొబ్బరి పాలు బరువు తగ్గడానికి దివ్య ఔషధంగా పనిచేస్తుంది. కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. అంతేకాదు ఎక్కువసేపు ఉన్న ఆకలి వేయదు. దీంతో ఇవి బరువు తగ్గేందుకు కూడా ఉపయోగపడతాయి. యాంటీ మైక్రోబెల్, యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ గుణాలు కొబ్బరిపాలలో సమృద్ధిగా ఉన్నాయి. ఇవి శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి..
Previous Post Next Post

نموذج الاتصال

Our website uses cookies to ensure you get the best experience. Learn more
Follow Me