Jackfruit Seeds : పనస పండు అంటే ప్రతి ఒక్కరికి బాగా తెలుసు. దాని రుచి మరియు సువాసన మనకు ఎంత దూరం లో ఉన్న కూడా నోరూరుతుంది. ఈ పండు రుచికి మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అని పోషకాహార నిపుణులు అంటున్నారు. అయితే ఈ పనస పండు మాత్రమే కాదు గింజలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే ఈ గింజలలో ప్రోటీన్లు మరియు ఫైబర్,ఎంతో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఒమేగా త్రీ,ఒమేగా సిక్స్ లాంటి వాటితో పాటుగా విటమిన్లు, మెగ్నీషియం, పొటాషియం, జింక్ లాంటి ఖనిజాలు సమృద్ధిగా ఉన్నాయి. అలాగే ఈ పనస పండు గింజలలో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ పండ్లు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడం లో హెల్ప్ చేస్తుందని అంటున్నారు నిపుణులు…

పనస గింజలలో ఉండే ఫైబర్ జీర్ణ క్రియను మెరుగుపరచడంలో కూడా హెల్ప్ చేస్తుంది. ఇది మలబద్ధకాన్ని తగ్గించడానికి కూడా ఎంతగానో హెల్ప్ చేస్తుంది. అలాగే పనస గింజలలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో ఎంతో హెల్ప్ చేస్తాయి. ఈ పనస గింజలలో ఉండే యాంటీ యాక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ తో కలిగి నష్టాల నుండి కూడా మన శరీరాన్ని కాపాడతాయి. అలాగే పనస గింజలలో ఉండే మెగ్నీషియం మరియు పొటాషియం మన గుండె ఆరోగ్యానికి ప్రత్యేకమైన ఖనిజం అని చెప్పొచ్చు. అలాగే దీనిలో ఉండే పొటాషియం రక్తనాళాలను సడలించి గుండె వ్యవస్థ మెరుగ్గా ఉంచుతుంది అని అంటున్నారు. అలాగే ఈ పనస గింజలలో యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాల పెరుగుదలను కూడా తగ్గిస్తాయి…
బరువు తగ్గాలి అని అనుకునే వారికి పనస గింజలు తీసుకుంటే చక్కని ఫలితం ఉంటుంది అని అంటున్నారు. ఎందుకు అంటే ఈ పనస గింజలలో ఉండే ఫైబర్ ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉంచుతుంది. దీంతో ఆహారాన్ని అతిగా తీసుకోకుండా ఉంటారు. దీంతో మీరు ఈజీగా బరువు తగ్గుతారు. అలాగే పనస పండు గింజలలో ఐరన్ అనేది పుష్కలంగా ఉంటుంది. ఇది ఎర్ర రక్త కణాలను పెంచడంలో కూడా హెల్ప్ చేస్తుంది. ఇవి చర్మం మరియు జుట్టు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి. అలాగే పనస గింజలలో విటమిన్ సి, యాంటీ యాక్సిడెంట్లు, చర్మం మరియు జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయని నిపుణులు అంటున్నారు. అలాగే చర్మం స్థితిస్థాపకతను మెరుగుపరచడంలో మరియు ముడతలను నియంత్రించడంలో మరియు జుట్టు రాలడాన్ని తగ్గించటంలో కూడా హెల్ప్ చేస్తాయి అని అంటున్నారు