Drinking Water : ఖాళీ క‌డుపుతో కొత్తిమీర నీళ్లు తాగితే ఎన్ని ప్రయోజ‌నాలు ఉన్నాయో తెలుసా?

P Madhav Kumar
1 minute read


Drinking Water : సాధార‌ణంగా ఎవ‌రి ఇంట్లో చూసిన కూడా కొత్తిమీర లేకుండా కూర వండ‌రు. కొత్తిమీర రుచితో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇక కొత్తిమీర నీరు అయితే ఎసిడిటీ, పిత్తాను తగ్గించడంలో చాలా ఉప‌యోగ‌ప‌డుతుంది. కొత్తిమీరలోని గుణాలు మ‌న క‌డుపు లోప‌ల ప‌లు స‌మ‌స్య‌ల‌ని కూడా త‌గ్గిస్తాయి. ఎసిడిటీ వ‌ల‌న వ‌చ్చే ప‌లు స‌మ‌స్య‌ల‌కి కూడా కొత్తి మీర నీరు చాలా ఉప‌యోగ‌ప‌డుతుంది. ఖాళీ కడుపుతో కొత్తిమీర నీళ్లు తాగడం వల్ల కడుపు సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.బరువు నియంత్రణలో, బరువు తగ్గడంలో కొత్తిమీర నీరు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కొత్తిమీరలో ఉండే ఫైబర్ కడుపు నిండుగా ఉంచి ఆకలిని తగ్గిస్తుంది.

Drinking Water స‌హ‌జ నివారిణి..

మలబద్ధకం సమస్యను దూరం చేయడంలో కొత్తిమీర నీరు ఉపయోగపడుతుంది. కొత్తిమీర నీరు తీసుకోవడం వల్ల శరీరంలో నీటి శాతం పెరుగుతుంది. కొత్తిమీర థైరాయిడ్ సమస్యలకు సహజ నివారణగా పనిచేస్తుంది. బరువు నియంత్రణ, బరువు తగ్గడంలో కొత్తిమీర నీరు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కొత్తిమీరలో ఉండే ఫైబర్ కడుపు నిండుగా ఉంచడంతో పాటు ఆక‌లిని తీరుస్తుంది. జీర్ణ‌క్రియ‌ని మెరుగుప‌ర‌చ‌డంతో పాటు బ‌రువు నియంత్ర‌ణ‌లోను ఎంతో సాయ‌ప‌డుతుంది. కొత్తిమీరలో ఉన్న పాలీఫెనాల్ యాంటీ ఆక్సిడెంట్లు కొవ్వును కరిగించడంలో సహాయపడతాయి.

కొత్తి మీర నీళ్లు థైరాయిడ్ సమస్యలకు సహజ నివారణగా పనిచేస్తుంది. కొత్తిమీర ఆకులు, కాండం యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి సరైన థైరాయిడ్ పనితీరుకు సహాయపడతాయి. మీరు దీన్ని ఉదయం ఖాళీ కడుపుతో తాగితే అద్భుత ఫలితం ఉంటుంది. కొత్తిమీర నీటిని తీసుకోవడం వల్ల శరీరంలో నీటి శాతం పెరుగుతుంది. ఇది మలబద్ధకం నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. కొత్తిమీర గింజలలో ఉండే థైమోల్ అనే పదార్ధం మలబద్ధకం నుండి ఉపశమనం కలిగించే జీర్ణ రసాల స్రావాన్ని పెంచుతుంది.

Chat