మీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలున్నా వాటన్నిటికీ సర్వరోగ నివారిణి ఆయుర్వేదంలో ఒకటి ఉంది. దీనిని మీరే స్వయంగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు.
కావల్సినవి:
* 250 గ్రాముల మెంతులు
* 100 గ్రాముల వాము
* 50 గ్రాముల నల్ల జీలకర్ర
తయారీ విధానం:
ముందుగా 3 పదార్థాలను రాళ్లు, మట్టి వంటివి లేకుండా శుభ్రం చేసుకోవాలి. వేరు వేరుగా పెనం పైన వేసి కొద్దిగా వేడి చేయాలి. మెంతులు, వాము, నల్ల జీలకర్ర కలిపి పొడిగా చేసుకోవాలి.
గాలి పోయే వీలులేని సీసాలో నిల్వ చేసుకోవాలి.
ఇలా వాడాలి:
* రోజూ రాత్రి భోజనం తర్వాత 1 గ్లాసు వేడి నీళ్లలో 1 స్పూన్ చూర్ణం (పొడి)ని కలిపి తాగాలి.
* ఆ తర్వాత ఎటువంటి ఆహారం తీసుకోరాదు.
* రోజూ ఈ పొడిని తాగితే శరీరంలో పేరుకున్న విష పదార్థాలు మల, మూత్ర, చెమటల ద్వారా బయటకువస్తాయి.
Tags
ఆరోగ్యం