స్నానం ఎప్పుడు చేయాలి,పొరపాటున కూడా కొన్ని వేళల్లో స్నానం చేయవద్దంటున్న ఎక్స్‌పర్ట్స్, స్నానం చేయడానికి అనువైన సమయం ఏంటో తెలుసా? - when you should never take a bath

P Madhav Kumar


when you should never take a bath

బలహీనంగా ఉన్నప్పుడు

బలహీనంగా ఉన్నప్పుడు

నిపుణుల ప్రకారం అలసిపోయినప్పుడు లేదా బలహీనంగా ఉన్నప్పుడు స్నానం చేయకుండా ఉండటం మంచిది. ఎందుకంటే శారీరక అలసట మీ శక్తి నిల్వలను తగ్గిస్తుంది. హృదయనాళ నియంత్రణను బలహీనపరుస్తుంది. అంతేకాకుండా చాలా అలసిపోయినప్పుడు, బలహీనంగా ఉన్నప్పుడు వేడి స్నానం అస్సలు చేయకూడదు. ఎందుకంటే ఇది రక్త నాళాలను విస్తరిస్తుంది. ఇది రక్తపోటును తగ్గిస్తుంది. దీంతో తల తిరగడం లేదా మూర్ఛపోయే ప్రమాదాన్ని పెంచుతుంది. తీవ్రమైన సందర్భాల్లో, గుండెపోటు సంభవించవచ్చు. ముఖ్యంగా వృద్ధులకు, గుండె జబ్బులు ఉన్నవారికి.

రాత్రి 10 నుంచి తెల్లవారు జామున 2 గంటల మధ్య

రాత్రి 10 నుంచి తెల్లవారు జామున 2 గంటల మధ్య

అనేక మంది నిపుణుల అభిప్రాయం ప్రకారం, రాత్రిపూట.. ముఖ్యంగా రాత్రి 10:00 గంటల నుంచి తెల్లవారుజామున 2:00 గంటల మధ్య స్నానం చేయకూడదు. దీని వల్ల హృదయనాళ వ్యవస్థపై చాలా ఒత్తిడి పడుతుంది. ఈ సమయంలో శరీర ఉష్ణోగ్రత సహజంగా తగ్గుతుంది. దీంతో మీరు గాఢ నిద్రకు సిద్ధమవుతారు. హృదయ స్పందన రేటు, రక్తపోటు కూడా తగ్గుతాయి. నిద్ర చక్రంలో భాగంగా రక్త నాళాలు కొద్దిగా సంకోచించబడతాయి. ఈ సమయంలో వేడి లేదా చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల శరీరం అకస్మాత్తుగా ఉష్ణోగ్రత, రక్త ప్రవాహాన్ని సర్దుబాటు చేయాల్సి వస్తుంది. ఇది స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. అకస్మాత్తుగా గుండెపోటు వచ్చే అవకాశాలు పెరుగుతాయి.

అధిక జ్వరం ఉన్నప్పుడు

అధిక జ్వరం ఉన్నప్పుడు

అధిక జ్వరం ఉన్నప్పుడు వేడి లేదా చల్లటి నీటితో స్నానం చేయడం మంచిది కాదు. స్నానం చేయడం వల్ల జ్వరం లక్షణాలు మరింత తీవ్రమవుతాయి. చలి, కండరాల తిమ్మిరి, రక్తపోటులో హెచ్చుతగ్గులు లేదా మూర్ఛ కూడా వస్తాయి. తీవ్రమైన సందర్భాల్లో, ఇది గుండెపై మరింత ఒత్తిడిని కలిగిస్తుంది. లేదంటే శ్వాస తీసుకోవడంలో ఆకస్మిక ఇబ్బందిని కలిగిస్తుంది. ఉష్ణోగ్రతలో ఆకస్మిక మార్పుల వల్ల వణకడం మొదలు పెడతారు. వేడి నీటితో స్నానం చేయడం వల్ల కలిగే వేడి ఇప్పటికే పెరిగిన శరీర ఉష్ణోగ్రతను మరింత పెంచుతుంది. దీని వలన మీరు ఇంకా ఇబ్బందికి గురవుతారని నిపుణులు చెబుతున్నారు.

స్నానం చేయడానికి అనువైన సమయం

స్నానం చేయడానికి అనువైన సమయం

సాయంత్రం 5:00 గంటల నుంచి రాత్రి 8:00 గంటల మధ్య స్నానం చేయడానికి బెస్ట్ అంటున్నారు నిపుణులు. ఈ సమయంలో మీ శరీరం చాలా స్థిరంగా, చురుగ్గా ఉంటుంది. ఒకవేళ ఏవైనా పనుల కారణంగా మీరు ఆలస్యంగా స్నానం చేయాల్సి వస్తే, నీటి ఉష్ణోగ్రత గోరువెచ్చగా (సుమారు 37-39 డిగ్రీల సెల్సియస్) ఉండాలి. అంతేకాకుండా స్నానం చేసే సమయాన్ని 10 నిమిషాల కంటే తక్కువ ఉండేలా చూసుకోండి. అంతేకాకుండా తడి జుట్టుతో నిద్రపోకండి.

గమనిక
ఇది సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఇది ఏ విధంగానూ ఏ మెడిసిన్ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వీటిని పాటించేముందు మరింత సమాచారం కోసం ఎల్లప్పుడూ మీ వైద్యుడిని సంప్రదించండి. 

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!