ఈ ఒక్క చిట్కాతో నరాల బలహీనత మటుమాయం…!

 నరాలకు సంబంధించిన కొన్ని ముఖ్య విషయాలు వాటి లక్షణాలు సక్రమంగా ఆరోగ్యంగా పనిచేయడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహార పదార్థాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. చేతులు తిమ్మిర్లు ఎక్కిన కొంచెం పట్టుత్వం తప్పిన వెంటనే మనం నిర్ధారణకు వచ్చేస్తాం. నరాల బలహీనత వచ్చింది అని.. నిజానికి రక్తనాళాలు వేరు నరాలు వేరు, నరాలు మనకి సంకేతాలను ప్రసారం చేయడానికి ఉపయోగపడతాయి. అంటే మనం ఏ పని చేయాలి ఏ పని చేయడానికి ఏ అవయవాలు ఎలా పని చేయాలి అనే సంకేతాలు మెదడుకి మన నరాలు అందిస్తూ ఉంటాయి. మెదడు తిరిగి సంకేతాలను పంపిస్తూ ఉంటుంది. ఈ కలగే రక్తనాళాలు రక్తనాళాలు ప్రతి అవయవానికి రక్తాన్ని సరఫరా చేస్తాయి. దీనినే నాడీ వ్యవస్థ అంటారు. నాడి వ్యవస్థ శరీరంలోని ఒక ముఖ్యమైన భాగం ఇది శ్వాస మరియు హృదయ స్పందన నుండి కదలిక మరియు సంచలనం వరకు దాని అన్ని విధులను నియంత్రిస్తుంది. ఇది మెదడు వెన్నుపాము మరియు శరీరమంతా విస్తరించి ఉన్న నరాల నెట్వర్క్ ను కలిగి ఉంటుంది. నాడీ వ్యవస్థకు ఏదైనా నష్టం లేదా అంతరాయం కలిగితే ఒక వ్యక్తి యొక్క ఆరోగ్యానికి తీవ్రమైన పరిణామాలను కలిగి ఉంటుంది

మరి ఈ నరాలు ఎందుకు బలహీనపడతాయి.. విటమిన్ b12 లోపిస్తే నరాల పనితీరులో మార్పులు వస్తాయి. పోషకాహార లోపాలు వల్ల కూడా నరాలు దెబ్బతింటాయి. మరియు బలహీనతకు గురవుతాయి. నాడీ వ్యవస్థ యొక్క సరైన పని తీరుకు విటమిన్ బి12 అవసరం.. మరి అది గనక లోపిస్తే పెరిఫెరల్ న్యూరోపతికి దారితీస్తుంది. ఇది చేతులు మరియు కాళ్లలో నొప్పి జలదరింపు మరియు బలహీనతను కలిగిస్తుంది. రోగనిరోధక వ్యవస్థ నరాలపై దాడి చేసి బలహీనత తిమ్మిరి మరియు జలతరింపులకు దారితీస్తుంది. కొన్ని మందులు మరియు టాక్సిన్స్ నరాలను దెబ్బతీస్తాయి. అంటే దీర్ఘకాలిక వ్యాధులకు మందులు వాడే వాళ్ళకి చీటికిమాటికి ప్రతి చిన్న దానికి మందులు వేసుకుంటూ ఉంటారు. కొంతమంది అటువంటి వాళ్ళు కూడా నరాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. నరాలు దెబ్బతింటాయి.

ముందుగా మనం జీవనశైలిలో మార్పులు చేసుకుంటే నరాల బలహీనత ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ఒత్తిడిని తగ్గించుకోవడం ఆరోగ్యకరమైన జీవనశైలి వల్ల నరాలు బలహీనత ప్రమాదం తగ్గుతుంది. ఇందులో సమతుల్య ఆహారం తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయమం చేయాలి. తగినంత నిద్రపోవాలి. అందుకే మెదడు ఆరోగ్యం కోసం ఒత్తిడి లేని లైఫ్ స్టైల్ ఎంచుకోవాలి.బియ్యం, గోధుమలు, జొన్నలు, సజ్జలు, రాగులు, పెసలు, కందులు మెదలగు లాంటి వాటిని వీలైనంతవరకు పొట్టు లేకుండానే తినడానికి ప్రయత్నం చేయండి. మీకు కుదిరితే గనక ధాన్యం పై పొట్టుని తౌడు అంటారు. అలాగే గోధుమలు ఆడించాక పై పొట్టు వస్తుంది దాన్ని కూడా మీరు రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటే నరాల బలహీనత సమస్య చాలా వరకు తగ్గిపోతుంది అని కొంతమంది ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి తగినంత శ్రద్ధ తీసుకుని సమతుల్యమైన ఆహారం అలాగే జీవన విధానంలో సరైన మార్పులు చేసుకుంటూ ఉంటే నరాల బలహీనత సమస్యను అధిగమించవచ్చు…

Previous Post Next Post

نموذج الاتصال

Our website uses cookies to ensure you get the best experience. Learn more
Follow Me