Health Benefits : ఇది ఆఫ్ స్పూన్ తీసుకుంటే చాలు.. బరువుతో పాటు జీర్ణ సమస్యలు కూడా తగ్గిపోతాయి!


Health Benefits : మారుతున్న జీవన విధానం వల్ల ప్రతీ ఒక్కరూ అనేక అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పుడుతన్నారు. ఈ అనారోగ్య సమస్యల నుండి బయట పడాలంటే ప్రస్తుతం ఉన్న జీవన విధానాన్ని కూడా మార్చుకోవాలి. అలాగే సరైన ఆహారం, వ్యాయామం తప్పనిసరి. వీటితో పాటు అనారోగ్య సమస్యలు తగ్గించుకోవడానికి ఇంగ్లీషు మందులు కాకుండా అప్పుడప్పుడు ఇంటి చిట్కాలను కూడా ఉపయోగించడం చాలా మంచిది. ఇప్పుడు మనం తెలుసుకుబోయే చిట్కా శరీరంలో అధిక బరువును తగ్గించి, జీర్ణ సమస్యలను, డయాబెటిస్ వంటి వాటని కూడా తగ్గిస్తుంది.

అయితే ఈ అద్భుతమైన చిట్కాను ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఇందుకోసం ముందుగా అవిసె గింజలు, వాము, జీలకర్ర. ఈ మూడింటిని సమాన మోతాదులో తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అవిసె గింజలును ప్రస్తుతం చాలా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అవిసె గింజల్లో ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పాస్పరస్, జింక్, పొటాషియం, ఒమేగా 3 ప్యాటీ యాసిడ్స్ పుష్కలంగా లభిస్తాయి. అవిసె గింజలు శరీర బరువును తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడతాయి. వాము జీర్ణ సంబంధ సమస్యలను తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. వాములో డైటరీ ఫైబర్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటివి పుష్కలంగా లభిస్తాయి. వాము వాత, కఫ, పిత్త దోషాలను తగ్గించడంలో చాలా బాగా సాయపడతాయి.

జీర్ణ క్రియను మెరుగుపరచడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకునే అవకాశం ఉండదు. వాములో ఫైబర్ శాతం అధికంగా ఉండటం వల్ల మల బద్ధకం సమస్యను కూడా తగ్గిస్తుంది. జీల కర్రలో ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, పాస్పరస్ సమృద్ధిగా ఉంటాయి.అలాగే విటామిన్ ఏ, విటామిన్ బి, విటామిన్ సి, విటామిన్ కె, విటామిన్ బి6 పుష్కలంగా లబిస్తాయి. సోడియం, మెగ్నీషియం, డైటరీ ఫైబర్ అధికంగా ఉంటాయి. జీలకర్ర మలబద్ధకం సమస్య తగ్గించడంలో షుగర్ కంట్రోల్ లో ఉంచడంలో చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ పొడిని తయారు చేసుకొని బయట ఐదే 15 రోజుల పాటు నిల్వ చేసుకోవచ్చు. ఫ్రిడ్జిలో ఐదే నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఈ పొడిని ప్రతి రోజూ అర చెంచా చొప్పున తీసుకుంటే శరీరంలో అధిక బురవు, కొవ్వు, జీర్ణ సంబంధిత సమస్యలు, డయాబెటిస్ వంటివి తగ్గుతాయి.

Previous Post Next Post

نموذج الاتصال

Our website uses cookies to ensure you get the best experience. Learn more
Follow Me