Krishna Phalam : ఈ పండు గురించి తెలుసా.. దీన్ని తింటే ఎన్ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయంటే..?


Krishna Phalam : మనలో చాలా మందికి సీతాఫలం, రామాఫలం, లక్ష్మణ ఫలం గురించి తెలుసు. కానీ కృష్ణ ఫలం గురించి పెద్దగా తెలియదు. ఊదా, పసుపు, ఆకుపచ్చ రంగుల్లో లభించే ఈ ఫలం ప్యాషన్‌ ఫ్రూట్‌గా బాగా ప్రసిద్ధి చెందింది. ఈ ఫలంలో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఈ ఫలం చాలా జ్యూసీగా ఉంటుంది. ఈ పండులో కాల్షియం, మెగ్నిషియం, భాస్వరం, పొటాషియం, ఫోలిక్‌ యాసిడ్‌, పీచు, విటమిన్లు, ప్రొటీన్లు, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఎ, సి వంటివి చాలా సమృద్ధిగా ఉంటాయి. ఈ పండు తింటే క్యాన్సర్, జీర్ణ సమస్యలు, కంటి సమస్యలు, మధుమేహం, గుండె, వృద్ధాప్య సంకేతాలు తగ్గుతాయి. డయాబెటిస్ ఉన్నవారికి ఈ పండు చాలా మంచిది.

ఈ పండులో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్, ఫైబర్ అధికంగా ఉంటాయి. డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు ఇన్సులిన్ స్థాయిలను నిర్వహించడానికి ఇది మంచి పండు. ఇందులో పీచు ఎక్కువగా ఉంటుంది. ఇది పెక్టిన్ లాంటిది. ఇది మీ క్యాలరీలను పెంచకుండానే కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. దీంతో ఆహారం త‌క్కువ‌గా తింటారు. ఇది బ‌రువు త‌గ్గేందుకు స‌హాయ ప‌డుతుంది. చర్మ సంరక్షణలో సహాయపడుతుంది. ఈ పండులో విటమిన్ ఎ, విటమిన్ సి, రిబోఫ్లేవిన్, కెరోటిన్ వంటి అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.ఈ యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలో ఫ్రీ రాడికల్స్ ఉత్పత్తిని తగ్గిస్తాయి. ఫ్రీ రాడికల్స్ మన శరీర కణాల ద్వారా ఉప ఉత్పత్తిగా ఉత్పత్తి చేయబడతాయి. చర్మం వృద్ధాప్యానికి కారణమవుతాయి. ఈ పండులో విటమిన్ సి, బీటా-క్రిప్టోక్సంతిన్, ఆల్ఫా కెరోటిన్ ఉన్నాయి.

అందువల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది ఎర్ర రక్త కణాలలో హిమోగ్లోబిన్‌ను పెంచే ఇనుమును కూడా కలిగి ఉంటుంది. రక్తహీనతతో బాధపడుతున్నట్లయితే ఈ పండును మీ ఆహారంలో క్రమం తప్పకుండా చేర్చుకోండి. ఈ పండులో రిబోఫ్లావిన్ (విటమిన్ బి6), నియాసిన్ (విటమిన్ బి3) సమృద్దిగా ఉంటాయి. ఇవి మన శరీరంలో థైరాయిడ్ కార్యకలాపాలను మెరుగుపరుస్తాయి. గుండె సజావుగా పనిచేయడానికి సహాయపడుతాయి. ఫినోలిక్ సమ్మేళనాలు, ఆల్కలాయిడ్స్ కూడా ఒత్తిడిని దూరం చేసి ప్రశాంతతను కలిగిస్తాయి.ఈ పండులో మెగ్నిషియం, కాల్షియం, ఐరన్ ఫాస్పరస్, పొటాషియం, సోడియం వంటి ఖనిజాలు చాలా సమృద్ధిగా ఉంటాయి. ఈ ఖనిజాలు ఎముకల సాంద్రతను అలాగే బోలు ఎముకల వ్యాధిని నివారిస్తాయి. మీరు ఈ పండును స్మూతీల‌లో కలపడం, జామ్ చేయడం లేదా పూర్తిగా తినడం ద్వారా ప్రయోజనాల‌ను పొందవచ్చు.

Previous Post Next Post

نموذج الاتصال

Our website uses cookies to ensure you get the best experience. Learn more
Follow Me