యూరిక్ యాసిడ్‌ని తగ్గించే ఫుడ్స్,ఇప్పుడు చెప్పే ఫుడ్స్‌లో కొన్ని తిన్నా బాడీలోని యూరిక్ యాసిడ్, కిడ్నీల్లోని రాళ్లు బయటికి రావాల్సిందే - which foods have no purines

P Madhav Kumar


ఇప్పుడు చెప్పే ఫుడ్స్‌లో కొన్ని తిన్నా బాడీలోని యూరిక్ యాసిడ్, కిడ్నీల్లోని రాళ్లు బయటికి రావాల్సిందే

చీజ్‌

చీజ్‌ని కూడా గౌట్ ఫ్రెండ్లీ ఫుడ్ అని చెప్పొచ్చు. ఇందులో ప్యూరిన్ తక్కువగా ఉండడమే కాకుండా యూరిక్ యాసిడ్‌ని తగ్గిస్తుంది. అయితే మోతాదులోనే తీసుకోవాలని గుర్తుంచుకోండి. కాటేజ్ చీజ్, స్కిమ్డ్ మిల్క్ వంటి లో ఫ్యాట్ చీజ్‌ని తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ విచ్ఛిన్నమవుతుంది. ఇందులో ఒరోటిక్ యాసిడ్ ఉంటుంది. ఇది బాడీ యూరిక్ యాసిడ్‌ని తగ్గిస్తుంది. కొంతమందికి ఇది సూట్ కాకపోవచ్చు. వారు తీసుకునే ముందు డాక్టర్ సలహా తీసుకుని తీసుకోవడం మంచిది.

మజ్జిగ

మజ్జిగలో కూడా యూరిక్ యాసిడ్‌ని కంట్రోల్ చేసే గుణాలు ఉండడతో పాటు ఇది బాడీని చల్లబరుస్తుంది. ఇది జీర్ణ సమస్యల్ని దూరం చేస్తాయి. దీంతోపాటు యూరిక్ యాసిడ్ లెవల్స్‌ని పెరగకుండా చేస్తాయి. మజ్జిగని రెగ్యులర్‌గా తీసుకుంటే గౌట్, యూరిక్ యాసిడ్ లెవల్స్‌ని తగ్గిస్తాయి. ఇందులోని ప్రోటీన్ కూడా సమస్యని తగ్గిస్తుంది. దీంతోపాటు ఇది జీర్ణ వ్యవస్థని మెరుగ్గా చేస్తుంది. దీని వల్ల అసిడిటీ సమస్యల్ని దూరం చేయడమే కాకుండా హైడ్రేషన్ అందుతుంది. దీని వల్ల కిడ్నీల్లోని వ్యర్థాలను కూడా బయటికి వస్తాయి.

పెరుగు

పెరుగులో కూడా లో ఫ్యాట్ పెరుగు తీసుకుంటే బాడీలో యూరిక్ యాసిడ్ పెరగకుండా చూస్తాయి. పెరుగు కూడా ప్రోటీన్‌కి మంచి సోర్స్. ఇతర ప్రోటీన్ సోర్స్ ఫుడ్స్ కంటే పెరుగులో తక్కువగా ప్యూరిన్‌ ఉంటుంది. దీంతో పాటు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కూడా ఉంటాయి. ఈ కారణంగా బాడీలోని యూరిక్ యాసిడ్ లెవల్స్‌ని తగ్గిస్తాయి.

Chat