ఒకే పిండితో ఇడ్లీ దోశలు,ఒక్క పిండితోనే ఇడ్లీ, దోశలు, ప్రోటీన్‌తో తయారయ్యే బ్రేక్‌ఫాస్ట్‌‌తో కిలోల కొద్దీ బరువుని తగ్గిస్తాయి, పైగా రుచి కూడా - weight loss friendly idli, dosa recipe

P Madhav Kumar


​ఇడ్లీ, దోశలు చాలా మంది ఫేవరేట్ బ్రేక్‌ఫాస్ట్. పైగా మనం రెగ్యులర్‌గా చేసే బ్రేక్‌ఫాస్ట్. హెల్దీగా ఉదయాన్నే తినాలనుకునేవారు చాలా మంది ఇడ్లీనే ప్రిఫర్ చేస్తారు. కానీ, దోశల్ని కూడా చాలా మంది ఇష్టంగా తింటారు. అయితే ఇడ్లీలు రవ్వతో చేస్తాం. దోశలు కూడా కార్బోహైడ్రేట్‌. అలా కాకుండా ఉదయాన్నే ఇడ్లీ, దోశ కావాలి. అది కూడా ప్రోటీన్‌తో తయారు కావాలంటే మాత్రం ఇప్పుడు చెప్పే రెసిపీని ఫాలో అవ్వాల్సిందే. నార్మల్ ఇడ్లీని రవ్వతో చేస్తారు. కానీ, ఇప్పుడు చెప్పే ఇడ్లీ, దోశలని పప్పులు, ఓట్స్‌తో కలిపి చేస్తాం. దీంతో ప్రోటీన్ పుష్కలంగా అందుతుంది. దీంతో హాయిగా కడుపు నిండుతుంది. పైగా ఈ ఇడ్లీ, దోశలు బరువు తగ్గడానికి హెల్ప్ అవుతాయి.
ఒక్క పిండితోనే ఇడ్లీ, దోశలు, ప్రోటీన్‌తో తయారయ్యే బ్రేక్‌ఫాస్ట్‌‌తో కిలోల కొద్దీ బరువుని తగ్గిస్తాయి, పైగా రుచి కూడా
(ఫోటోలు- Samayam Telugu)

కావాల్సిన పదార్థాలు

  • మీకు నచ్చిన 4 నుంచి 5 రకాల పప్పులు ఒక్కో కప్పు చొప్పన తీసుకోండి.(పెసరపప్పు, మినపప్పు, శనగపప్పు, ఎర్ర కందిపప్పు, కందిపప్పు ఇలా నచ్చినవి తీసుకోవచ్చు)
  • ఓ కప్పు రోల్డ్ లేదా ఇన్‌స్టంట్ ఓట్స్

తయారీ విధానం

  • ముందుగా పప్పులు, ఓట్స్‌ని చక్కగా కడిగి సరిపడా నీరు పోసి నానబెట్టండి.
  • కనీసం 6 గంటలైనా నానబెట్టండి.
  • నానబెట్టిన పప్పు, ఓట్స్‌ని నీటిలో నుంచి తీసి మిక్సీ వేయండి.
  • కొద్దికొద్దిగా నీరు పోసి పిండి మెత్తగా సాఫ్ట్‌గా అయ్యేవరకూ మిక్సీ పట్టండి. అచ్చం ఇడ్లీ పిండి కలిపినట్లుగానే కలపండి.
  • తర్వాత దీనిని గిన్నెలోకి తీసుకుని రాత్రంతా పులియనివ్వండి.
  • ఉదయానికల్లా పిండి బాగా పులుస్తుంది.
  • పులిసిన పిండిలో కొద్దిగా ఉప్పు కలిపి ఇడ్లీల్లా వేయడమే.
  • ఇడ్లీలు చక్కగా ఉడికాయో లేదో చెక్ చేయడానికి టూత్‌పిక్ వాడండి.
  • ఈ ఇడ్లీలను కొబ్బరి చట్నీ, టమాట చట్నీతో తినొచ్చు. దీంతో పాటు సాంబార్ కూడా బెస్ట్ కాంబినేషన్.

దోశ కూడా

  • ఇదే పిండిని మీరు దోశలా కూడా చేయొచ్చు. దీనికోసం అదే పిండిలో కొద్దిగా నీరు పోసి దోశపిండిలా చేయండి.
  • క్రిస్పీగా అయ్యాక ఉల్లిపాయలు, టమాట, క్యాప్సికమ్ తురుము వంటివి వేయొచ్చు. ఊతప్పంలా కూడా చేయొచ్చు.
  • మీకు నచ్చిన చట్నీతో చేయొచ్చు.
Chat