
డాక్టర్ చెబుతున్నదేంటంటే

మీరు తీసుకునే ఆహారమే మీ ఎనర్జీకి కారణం. మీరు బరువు తగ్గేందుకు రోటీ, అన్నం మానేసినప్పుడు బాడీ కొవ్వు కణాలను బర్న్ చేస్తుంది. దీనిని లిపోసిస్ అంటారు. అయితే, ఇలా ఎన్నిరోజులు చేస్తారు. మహా అయితే 2 లేదా 3 వారాలు. ఆ తర్వాత బాడీలోని ముఖ్య పోషకాలు తగ్గుతాయి. దీని కారణంగా అతిగా తినాలనే క్రేవింగ్స్ పెరుగుతాయి. ఈ కారణంగా మళ్లీ రోటీ, చపాతీలు తినడమే కాకుండా బింజ్ ఈటింగ్ అంటే ప్రాసెస్డ్ అనే ఫుడ్స్ కూడా తేడా లేకుండా తింటాం. దీని కారణంగానే ముందుకంటే ఎక్కువగా బరువు పెరుగుతారు. అందుకే, డైట్‌ని సరిగా ప్లాన్ చేయాలని చెబుతున్నారు ఆయుర్వేద డాక్టర్ అమర్‌జీత్. ఆవిడే స్వయంగా రోటీ, చపాతీలను ఎలా తినాలి.. ఏ కాంబినేషన్‌తో తింటే బరువు పెరగారో చెబుతున్నారు. మొత్తానికే కార్బోహైడ్రేట్స్‌ని తగ్గించాల్సిన అవసరం లేదు. కొన్ని కాంబినేషన్స్ ట్రై చేయాలని సూచిస్తున్నారు.