నరాల బలహీనత తగ్గాలంటే ఈ ఒక్క ఆకుకూర చాలు…! This one green vegetable is enough to reduce nervous weakness...!

P Madhav Kumar


మనం ఆరోగ్యంగా ఉండాలంటే ముఖ్యంగా ఆకుకూరలు తినాలి. కానీ మనం వాటిని చూస్తేనే మొహం తిప్పేస్తాము.. ఎందుకంటే ఆకుకూరలు నోటికి రుచిగా ఉండవనికొందరి ఫీలింగ్.. ఆవిధంగాఆకు కురలని నిర్లక్ష్యం చేస్తున్నారు. అయితే ఆకుకూరల్లో ఉండే ఉపయోగాలు గురించి సరిగ్గా అవగాహన లేకపోవడమే.. కొందరికి తెలిసిన తినరు.. అలాగే చిన్నపిల్లలు కూడా ఆకుకూరలు అస్సలు తినరు.. ఆకుకూరల్లో అతి ముఖ్యమైన వాటిలో బచ్చల కూర కూడా ఒకటి. ఈ బచ్చలకురను ఎన్నో రకాలుగా ఉపయోగించుకోవచ్చు.. లేదంటే పప్పులో కూడా వేసుకోవచ్చు.అయితే ఇప్పుడు బచ్చలకూర వల్ల పలు ప్రయోజనాలను తెలుసుకుందాం.

ముఖ్యంగా బచ్చలి కూర శరీరానికి దివ్య ఔషధంగా పనిచేస్తుంది. రక్తహీనతతో బాధపడే వారికి కూడా బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా అధిక రక్తపోటు సమస్య ఉన్నవారికి కూడా తీసుకోవడం వల్ల వాటి నుంచి విముక్తి పొందవచ్చు.. ప్రతిరోజు ఈ ఆకుకూరలు తినడం వల్ల రక్తపోటు నియంతంలో ఉంటుందట. రక్తపోటు అదుపులో ఉంచుకోవచ్చు. ఈ కూరను ప్రతిరోజు ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వును పదార్థాలను శాతం కరిగిస్తుంది.ఇందులో ఒమేగా త్రీ ఆమ్లాలు, సెలీనియం అధికంగా ఉంటాయి. ఇది నరాల బలహీనత ఉండే వారికి నీరసంగా ఉండే వారికి చాలా ఉపయోగపడుతుంది.

ఇక అంతేకాకుండా మెదడు ఆరోగ్యంగా ఉండడానికి కూడా ఈ బచ్చలకూర చాలా సహాయపడుతుంది. మూత్రంలో ఇన్ఫెక్షన్ వంటి సమస్యతో ఇబ్బంది పడేవారు ప్రతిరోజు ఈ బచ్చల కూర తీసుకోవాలని వైద్యులు సూచిస్తూ ఉంటారు. ఎలాంటి సమస్యలు ఉన్నా తొలగిపోతాయి. అంతేకాకుండా కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు వంటి సమస్యలకు ఇబ్బంది పడేవారు ఈ ఆకులు తరచూ తినడం వల్ల సమస్య నుండి విముక్తి పొందవచ్చు.. అయితే ఈ బచ్చల కూరను పప్పులతో సహా కలుపుకొని ఫ్రై చేసుకుని తినడం వల్ల మరిన్ని పోషకాలు లభిస్తాయి.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!