Weightloss: గోధుమ పిండిలో ఇవి కలిపి చపాతీలు చేయండి. బరువు, షుగర్ తగ్గించేస్తాయి

Weightloss: మీరు బరువు తగ్గడానికి చపాతీలు తినడం మానేశారా? అక్కర్లేదు! చపాతీ పిండిలో ఇవి కలిపి వాడారంటే బరువు, షుగర్ కూడా తగ్గుతుంది. ఆ మ్యాజిక్ చేసే 5 పదార్థాలేంటో చూడండి.

గోధుమపిండిలో కలపాల్సిన పదార్థాలు
గోధుమపిండిలో కలపాల్సిన పదార్థాలు (Shutterstock)

భారతీయ ఆహారంలో చపాతీలు చాలా ముఖ్యమైన భాగం. గోధుమ పిండితో తయారు చేసిన చపాతీలో ఫైబర్, ప్రోటీన్, విటమిన్లతో పాటు కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలన్నీ శరీరానికి చాలా ముఖ్యం. అయితే ఊబకాయం లేదా అధిక బరువు వల్ల చాలా మంది చపాతీలు తినడం మానేస్తున్నారు. గోధుమ రొట్టెలు తినడం వల్ల బరువు పెరుగుతారని కొందరు నమ్ముతారు. కానీ వాస్తవానికి చపాతీ సరిగ్గా తింటే అది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. చపాతీ పిండిలో కొన్ని పదార్థాలు కలిపి చపాతీలు చేసుకుని తింటే కేలరీలు కరిగించడంలో సాయపడతాయి. అవేంటో చూడండి.

రాగి పిండి

గోధుమ పిండిలో చపాతీలు చేసేటప్పుడు రాగి పిండిని కలపవచ్చు. రాగుల పిండిలో ఫైబర్, అమైనో యాసిడ్స్ పుష్కలంగా లభిస్తాయి. దీనితో పాటు ఇందులో గ్లూటెన్ కూడా ఉండదు. ఈ పిండి కలిపిన రొట్టెలు తినడం వల్ల కడుపు త్వరగా నిండిపోయి సులభంగా జీర్ణమవుతుంది. రాగిపిండిని కలిపి తయారుచేసిన రొట్టెలు తినడం వల్ల వేగంగా బరువు తగ్గుతారు.

ఓట్స్ పొడి

ఓట్స్ పొడిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. గోధుమ పిండిలో ఓట్స్‌ను రోస్ట్ చేసి పొడి చేసి పిండిలో కలపవచ్చు. ఈ పిండితో చేసిన రొట్టెలు తినడం వల్ల బరువు తగ్గుతారు. అంతేకాక ఓట్స్ పిండితో చేసిన రొట్టెలు డయాబెటిస్ పేషెంట్లకు కూడా ఎంతో మేలు చేస్తాయి. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

మిల్లెట్స్ పౌడర్

చపాతీలు మరింత ఆరోగ్యంగా చేయడానికి చిరుధాన్యాలు లేదా మిల్లెట్స్ పిండి కూడా మంచి ఎంపిక. ఫైబర్, ప్రోటీన్‌తో పాటు, మెగ్నీషియం, ఐరన్ లాంటి అనేక ఇతర పోషకాలు ఈ పిండిలో పుష్కలంగా లభిస్తాయి. ఈ పిండి తినడం వల్ల కడుపు కూడా త్వరగా నిండిపోతుంది. దాంతో మీరు ఎక్కువగా తినరు. బరువు కూడా తగ్గుతారు.

జొన్న పిండి

ఇది కూడా గ్లూటెన్ లేని పిండి. దీంట్లో ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, ఇనుము లాంటి అనేక విటమిన్లు పుష్కలంగా కనిపిస్తాయి. కానీ ఒక కప్పు గోధుమపిండికి రెండు చెంచాల జొన్న పిండి కలిపితే చాలు. ఎక్కువగా కలిపితే చపాతీలు సరిగ్గా రావు. జొన్న పిండి బ్లడ్ షుగర్ ను నియంత్రించడంతో పాటు గుండె సంబంధిత సమస్యలను కూడా తగ్గిస్తుంది. ఇది పేలవంగా ఉన్న జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. గోధుమ పిండిలో జొన్న పిండిని కలపడం ద్వారా మీరు ఆరోగ్యకరమైన, రుచికరమైన రోటీలను తయారు చేసి తినేయొచ్చు.

మొక్కజొన్న పిండి

మొక్కజొన్న పిండిలో గోధుమ పిండి కంటే చాలా తక్కువ కేలరీలు ఉంటాయి. దీనితో పాటు, ఇది గ్లూటెన్ ఫ్రీ కూడా. మొక్కజొన్న పిండిలో ప్రోటీన్, ఐరన్, ఫాస్పరస్, జింక్.. అనేక విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది అనేక వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది. దీంతో పాటు కళ్లకు కూడా ఎంతో మేలు చేస్తుంది. దీన్ని గోధుమ పిండిలో కలపి రోటీ లేదా పరాటాలు చేయడానికి వాడొచ్చు.

HT Telugu ఫేస్‌బుక్ పేజీ ద్వారా అప్‌డేట్స్ పొందండి
Previous Post Next Post

نموذج الاتصال

Our website uses cookies to ensure you get the best experience. Learn more
Follow Me