Menstrual cup vs Pads: మెనుస్ట్రువల్ కప్ ఆధునికంగా వచ్చిన ఉత్పత్తి. ఎక్కువగా శానిటరీ ప్యాడ్స్ నే అమ్మాయిలు వాడుతున్నారు. అయితే శానిటరీ ప్యాడ్స్ కన్నా మెనుస్ట్రువల్ కప్ వాడడమే ఆరోగ్యకరమని అంటున్నారు నిపుణులు.
Menstrual cup vs Pads: మెనుస్ట్రువల్ కప్స్‌ను ఒక్కసారి కొనుక్కుంటే పదే పదే వాడుకోవచ్చు. శానిటరీ ప్యాడ్స్ ఒకసారి వాడి పేడసేవి. చాలామందికి ఉన్న సందేహం శానిటరీ ప్యాడ్స్ ఉండగా మెనుస్ట్రువల్ కప్స్ ఆవిష్కరణ ఎందుకు అని? శానిటరీ ప్యాడ్స్ వల్ల కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు అమ్మాయిలకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్యాడ్స్‌కు బదులు మెనుస్ట్రువల్ కప్ వాడడం ఆరోగ్యకరమని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
శానిటరీ పాడ్స్ వాడడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని ఎన్నో అధ్యయనాలు తేల్చాయి. నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ఒకప్పుడు చెప్పిన ప్రకారం ఈ శానిటరీ ప్యాడ్స్ వల్ల సంతానోత్పత్తి సమస్యలు, క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పింది. అయితే కొన్ని అధ్యయనాలు మాత్రం క్యాన్సర్ వచ్చే ప్రమాదం లేదని చెబుతున్నాయి. ఏది ఏమైనా ఎంతో కొంత ప్రమాదం పొంచి ఉన్న శానిటరీ ప్యాడ్స్ కన్నా మెనుస్ట్రువల్ కప్ వాడడమే మంచిదని చెబుతున్నారు గైనకాలజిస్టులు.
శానిటరీ పాడ్స్‌తో ఎందుకు ప్రమాదం?
శానిటరీ ప్యాడ్స్‌ను ఒకేసారి ఎక్కువగా తయారుచేస్తారు. అవి ఎక్కువ కాలం పాటు నిల్వ ఉండడానికి థాలేట్స్ అనే కర్బన సమ్మేళనాలను వాడతారు. థాలేట్స్ అనేది రసాయనాలలో భాగమే. ఈ థాలేట్స్ వల్ల శానిటరీ ప్యాడ్స్ ఎక్కువ కాలం పాటు వాడటం వల్ల కొన్ని రకాల సమస్యలు వస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. కానీ కొన్ని అధ్యయనాలు మాత్రం రావని వాదిస్తున్నాయి. ఏది ఏమైనా శానిటరీ ప్యాడ్స్ కన్నా మెనుస్ట్రువల్ కప్ వాడడం ఉత్తమం అని చెబుతున్నారు వైద్యులు.
పూర్వం వస్త్రాలతో కూడిన శానిటరీ ప్యాడ్స్ ను వాడేవారు. ఇప్పుడు సులభంగా ఉండేందుకు శానిటరీ ప్యాడ్స్‌ను తయారుచేసి రెడీమేడ్‌గా అమ్ముతున్నారు. అయితే వీటిలో కొన్ని రకాల రసాయనాలు కలపడం వల్ల మహిళల్లో ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందుకే మెనుస్ట్రువల్ కప్ వాడడం వల్ల ఎలాంటి సమస్య ఉండదని చెబుతున్నారు. వీటి వల్ల ఎలాంటి రసాయనాలు శరీరంలో చేరవని, వాటిని ఎప్పటికప్పుడు తీసి పరిశుభ్రంగా వాడుకోవచ్చు అని వివరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. మెనుస్ట్రువల్ కప్ రెండు మూడు కొనుక్కుంటే కొన్ని నెలల పాటు వాడవచ్చు.
మెనుస్ట్రువల్ కప్, శానిటరీ ప్యాడ్స్ మాత్రమే కాదు టాంపోన్స్, పాంటీ లైనర్స్ వంటివి కూడా అందుబాటులో ఉన్నాయి. అధిక రక్తస్రావం అయ్యేవారు టాంపోన్స్ వాడడం కూడా మంచిది. కానీ అన్నింటికన్నా శానిటరీ ప్యాడ్‌లను వాడే వారి సంఖ్య ఎక్కువే. ఇవి చాలా సులభంగా వాడవచ్చు. టాంపోన్స్, మెనుస్ట్రువల్ కప్ వంటివి యోని లోపలికి పెట్టుకోవాల్సి వస్తుంది. ఇవి కొందరికి అసౌకర్యంగా అనిపిస్తుంది. అందుకే ప్యాడ్స్ వాడతున్న వారి సంఖ్యే ఎక్కువగా ఉంది. అయితే వీటిని ప్రతి అయిదారు గంటలకు ఒకసారి మార్చుకోవడం మంచిది. లేకపోతే ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది.